బే ఏరియాలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

బే ఏరియాలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

10-01-2018

బే ఏరియాలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. పీపుల్‌ మీడియా గ్రూపుతో కలిసి నిర్వహించిన ఈ వేడుకలకు రమణా రెడ్డి (కాల్‌ హోమ్స్‌), ప్రసన్న (మై ట్యాక్స్‌ ఫైలర్‌), డా. కమలేష్‌ జింజువాడియా (ఈస్ట్‌ బే డెంటల్‌) స్పాన్సర్లుగా, మీడియా పార్టనర్‌గా విరిజల్లు వ్యవహరించింది.

ఈ వేడుకల సందర్భంగా బాటా కరవోకె టీమ్‌ పాడిన పాటలు, ఆటలు అందరినీ మైమరపింపజేశాయి. హులాహూప్‌ వంటి గేమ్స్‌లో పలువురు పాల్గొన్నారు. టాలీవుడ్‌ నటుడు నిఖిల్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చారు. చక్కగా ప్రోగ్రామ్‌ ఏర్పాట్లు చేశారంటూ బాటా టీమ్‌ను అభినందించారు. హిందీ, తెలుగు పాటలతో డిజెలు ఉత్సాహపరిచారు. ప్రెసిడెంట్‌ శిరీష బత్తుల మాట్లాడుతూ, వేడుకలను విజయవంతం చేసిన బాటా సభ్యులకు ఇతరులకు ధన్యవాదాలు తెలిపారు. వైస్‌ ప్రెసిడెంట్‌ యశ్వంత్‌ కుదరవల్లి, సెక్రటరీ సుమంత్‌ పుసులూరి, ట్రెజరర్‌ హరినాథ్‌ చికోటి, జాయింట్‌ సెక్రటరీ కొండల్‌రావును, స్టీరింగ్‌ కమిటీ సభ్యులు రవి తిరువీధుల, కామేష్‌ మల్ల, కళ్యాణ్‌ కట్టమూరి, కల్చరల్‌ కమిటీ సభ్యులు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారకదీప్తి, లాజిస్టిక్‌ కమిటీ సభ్యులు ప్రశాంత్‌ చింత, అరుణ్‌ రెడ్డి, వరుణ్‌ తదితరులను పరిచయం చేశారు. బాటా అడ్వయిజరీ బోర్డ్‌ సభ్యులు జయరామ్‌ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్‌ మంగిన, కరుణ్‌ వెలిగేటి, రమేష్‌ కొండ బాటా టీమ్‌ను అభినందించారు.

Click here for Event Gallery