స్వాగత్ రెస్టారెంట్ లో 10న "ఉభయభాషా ద్విగుణీకృత అష్టావధానం"
Telangana Tourism
Vasavi Group

స్వాగత్ రెస్టారెంట్ లో 10న "ఉభయభాషా ద్విగుణీకృత అష్టావధానం"

08-09-2017

స్వాగత్ రెస్టారెంట్ లో 10న

"ఉభయభాషాద్విగుణీకృత అష్టావధానం" అన్న ప్రక్రియ అమెరికాలో మొట్టమొదటి సారిగా జరిగి చరిత్ర సృష్టించనున్నది. సంస్కృతంలోనూ తెలుగులోనూ ఏకకాలంలో 16 మంది పృఛ్ఛకులతో అష్టావధానాలు చేయడం ఈ ప్రక్రియలోని విశిష్టత. ఇంకా ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఈ అవధాని కూడా ఒక అమెరికా పౌరుడే అయి ఉండటం.

తేది: సెప్టెంబర్ 10, 2017, ఆదివారం 
సమయము: మధ్యాహ్నం 2-00 నుంచి 5-00 వరకు
ప్రదేశము: Swagat Indian Restaurant, 68 S Abel St, Milpitas, CA 95035

అవధాని: అమెరికా పౌరులైన తెలుగు సోదరులు శ్రీ పాలడుగు శ్రీచరణ్

అధ్యక్షులు: శ్రీ రావు తల్లాప్రగడ

పృచ్ఛకులు: 
సంస్కృతానికి– శ్రీ మారేపల్లి నాగవెంకటశాస్త్రి, శ్రీ విశ్వాస్ వాసుకి, శ్రీ హరి కృష్ణమూర్తి, శ్రీ పిల్లలమర్రి కృష్ణకుమార్, శ్రీమతి సంధ్యా వాషీకర్, శ్రీమతి మాజేటి సుమలత, శ్రీ హరినారాయణ

తెలుగుకు – శ్రీ పుల్లెల శ్యాంసుందర్, శ్రీ హరి కృష్ణమూర్తి, శ్రీ మొహమ్మద్ ఇక్బాల్, శ్రీ తల్లాప్రగడ రావు, శ్రీ కొండూరు రవిభూషణ్ శర్మ, శ్రీ రెంటచింతల చంద్ర, శ్రీ ఆసురి వేణు, శ్రీమతి గీతామాధవి.

సన్మానం: మహాంధ్ర భారతి సౌజన్యం
అమెరికాలో ప్రప్రథమంగా జరుగుతున్న ఈ చారిత్రక కార్యక్రమంలో మీరందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము.