బే ఏరియాలో 'సమ్మోహనం' టీమ్

బే ఏరియాలో 'సమ్మోహనం' టీమ్

01-06-2018

బే ఏరియాలో 'సమ్మోహనం' టీమ్

సినీహీరో మహేష్‌బాబు బావమరిది సుధీర్‌ బాబు హీరోగా నటించిన చిత్రం 'సమ్మోహనం'. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఆదితిరావు హైదరి నటించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా సుధీర్‌బాబు బే ఏరియా వచ్చారు. రామన్‌ సంచులకు చెందిన సెర్రా థియేటర్‌లో మే 30వ తేదీ సాయంత్రం 6 గంటలకు సుధీర్‌బాబు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న అభిమానులను, స్నేహితులను ఉద్దేశించి సుధీర్‌బాబు మాట్లాడారు. ఈ చిత్రంలో తాను కామన్‌మ్యాన్‌ పాత్రలో కనిపిస్తానని చెప్పారు. జూన్‌ 14న ఈ చిత్రం రిలీజవుతుందని అందరూ సినిమాను చూడాలని కోరారు. తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌ చెన్నూరి వెంకట సుబ్బారావు కూడా సెర్రా థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click here for Photogallery