బే ఏరియాలో తానా-క్యూరీ కాంపిటీషన్స్ సక్సెస్

బే ఏరియాలో తానా-క్యూరీ కాంపిటీషన్స్ సక్సెస్

29-04-2018

బే ఏరియాలో తానా-క్యూరీ కాంపిటీషన్స్ సక్సెస్

బే ఏరియాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)- క్యూరీ కలిసి సన్నివేల్‌లో నిర్వహించిన పోటీలకు మంచి స్పందన వచ్చింది. మ్యాథ్స్‌, సైన్స్‌, స్పెల్లింగ్‌ బీలో నిర్వహించిన పోటీల్లో యువతీయువకులు, చిన్నారులు పెద్దఎత్తున పాల్గొన్నారు. తానా వెస్ట్‌ టీమ్‌కు చెందిన మధు రావెల, శ్రీకాంత్‌ దొడ్డపనేని, సతీష్‌ వేమూరి ఈ పోటీల విజయవంతానికి సహకరించారు. మూడు విభాగాల్లో గెలిచిన విజేతలకు సర్టిఫికెట్‌లను, ట్రోపీలను అందజేశారు. ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన గౌరి వేమూరి, స్వరూపకు నిర్వాహకులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Click here for Event Gallery