చంద్రబాబుకు మద్దతుగా బే ఏరియాలో ఎన్నారైల ధర్మపోరాట దీక్ష

చంద్రబాబుకు మద్దతుగా బే ఏరియాలో ఎన్నారైల ధర్మపోరాట దీక్ష

20-04-2018

చంద్రబాబుకు మద్దతుగా  బే ఏరియాలో ఎన్నారైల ధర్మపోరాట దీక్ష

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మద్దతుగా అమెరికాలోని బే ఏరియా ఎన్నారైలు ధర్మపోరాట దీక్షలో పాల్గొన్నారు. అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్‌ కోమటి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రాష్ట్రాభివృద్ధికోసం నిరంతరం తపిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రం నష్టపోరాదన్న ఉద్దేశ్యంతో తన పుట్టినరోజున ధర్మపోరాట దీక్ష చేయడం రాష్ట్రాభివృద్ధిపట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందని చెప్పారు.

ముఖ్యమంత్రికి మద్దతుగా ఎన్నారైలు కూడా ఈ దీక్ష చేస్తున్నారని ఆయన తెలిపారు. అమెరికాలో ఆరుబయట దీక్షలు చేయడానికి అనుమతులు లేని కారణంగా ఎపి జన్మభూమి కార్యాలయంలోనే ఈ దీక్షలను చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ దీక్షలో తొలుత వెంకట్‌ కోగంటి, రజనీకాంత్‌ కాకర్ల, సతీష్‌ కొండెపాటి, రాజా వేసంగి, గాంధీ పాపునేని, ఎంవి. రావు తదితరులు పాల్గొన్నారు. ఇంకా చాలామంది ఎన్నారైలు ఈ దీక్షలో పాల్గొనేందుకు తరలి వస్తున్నారని ఎన్నారై టీడీపి వర్గాలు పేర్కొన్నాయి.