బే ఏరియాలో ఘనంగా హోళీ పండుగ

బే ఏరియాలో ఘనంగా హోళీ పండుగ

13-03-2017

బే ఏరియాలో ఘనంగా హోళీ పండుగ

బే ఏరియాలో తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్‌ యూత్‌ ఆధ్వర్యంలో హోళీ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. లేక్‌ ఎలిజబెత్‌, సెంట్రల్‌ పార్క్‌, ఫ్రీమాంట్‌ తదితర ప్రాంతాల్లో హోళీ సంబరాలు అంబరాన్ని అంటేలా జరిగాయి. దాదాపు 400 మంది ఎన్నారైలు రంగులు చల్లుకుంటూ బాలీవుడ్‌, టాలీవుడ్‌ తెలంగాణ జానపద గీతాలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. డిజె గోస్వామి తన బాణీలతో అలరించారు. టాటా అడ్వయిజరీ చైర్మన్‌ పైళ్ళ మల్లారెడ్డి, ప్రెసిడెంట్‌ ఝాన్సీ రెడ్డి, రీజినల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అప్పిరెడ్డి, స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ రమేష్‌ తంగలపల్లి, నేషనల్‌ కల్చరల్‌ చైర్‌పర్సన్‌ శ్రీనివాస్‌ మానాప్రగడ, యూత్‌ చైర్‌పర్సన్‌ సతీష్‌ బనావత్‌, అమిత్‌ రెడ్డి, శశాంక్‌ గౌడ్‌, సుస్రత్‌ నిషాంత్‌, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.