చర్చలకు సిద్ధమని ప్రకటించడమే పెద్ద ముందడుగు: రాజ్‌ షా
MarinaSkies
Kizen
APEDB

చర్చలకు సిద్ధమని ప్రకటించడమే పెద్ద ముందడుగు: రాజ్‌ షా

13-03-2018

చర్చలకు సిద్ధమని ప్రకటించడమే పెద్ద ముందడుగు: రాజ్‌ షా

ఉత్తర కొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చర్చలపై వైట్‌హౌస్‌ అధికార ప్రతినిధి రాజ్‌ షా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా కిమ్‌ జాంగ్‌ ఉన్‌తో చర్చలు జరిపేది ఏప్రిల్‌లోనా లేక మేలోనా అన్నది ఇప్పుడే చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. చర్చలకు సిద్ధమని ప్రకటించడమే పెద్ద ముందడుగు అని ఆయన తెలిపారు. దీంతో ఎలాంటి అదనపు షరతులు విధించలేదని అన్నారు. అణ్వాయుధ పరీక్షలు నిలిపేస్తామని, దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా నిర్వహించుకునే సైనిక్య విన్యాసాలపై విమర్శలు చేయబోమని ఉత్తర కొరియా చెప్పిందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో దౌత్యపరమైన అంశాలే ఉంటాయని  అన్నారు. సమావేశ ముఖ్య లక్ష్యంపై తమ అధ్యక్షుడికి పూర్తి సృష్టత ఉందని తెలిపారు. తమ భాగస్వామ్య దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం గల దేశాల నుంచి చేసిన ఒత్తిడి సత్ఫలితం ఇచ్చిందని అన్నారు.