చరిత్ర సృష్టించిన 'తానా' బ్యాడ్మింటన్ లీగ్

చరిత్ర సృష్టించిన 'తానా' బ్యాడ్మింటన్ లీగ్

13-03-2018

చరిత్ర సృష్టించిన 'తానా' బ్యాడ్మింటన్ లీగ్

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) మొదటిసారిగా అమెరికాలో బ్యాడ్మింటన్‌ లీగ్‌ను విజయవంతంగా నిర్వహించిన చరిత్ర సృష్టించింది. నార్త్‌ ఈస్ట్‌ ఓహియో తెలుగు అసోసియేషన్‌ మద్దతుతో ఈ లీగ్‌ను విజయవంతం చేసింది. లీగ్‌ విజయవంతమవ్వడానికి తానా అధ్యక్షులు సతీష్‌ వేమన, జాయింట్‌  కోశాధికారి అశోక్‌ కొల్లా కృషి చేశారు. నియోటా అధ్యక్షుడు మువ్వా ప్రసాద్‌, నియోటా స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ వెంకట రమణ ఈర్ల, తానా మెంబర్‌షిప్‌ వెరిఫికేషన్‌ కమిటీ సభ్యుడు రామరావు పంగులురి, తానా కమిటీ చైర్‌ (కాన్సులేట్‌ లయజన్‌ న్యూయార్క్‌) రవి వడ్లమూడి తమ సహాయ సహకారాలు అందించారు.

రిమైండర్‌ విల్లే అథ్లెట్‌ క్లబ్‌లో జరిగిన ఈ లీగ్‌లో దాదాపు 140 మంది పైగా ఆటగాళ్లు పాల్గొన్నారు. రిమైండర్‌ విల్లే మేయర్‌ శాం అలోన్సన్‌ ఈ లీగ్‌ను ప్రారంభించారు. ఈ వేడుకలో జగదీష్‌ మెడరమెట్ల, మురళి లక్కిరెడ్డి పాల్గొన్నారు. లి-నింగ్‌, ఆస్పెన్‌ డెంటల్‌, ఏటీ అండ్‌ టీ, మత్‌ప్లస్‌, రుచి ఇండియన్‌ క్విజెన్‌, ప్యారడైజ్‌ బిర్యానీ, ఆల్‌ ప్రెం క్లీనర్స్‌తో పాటు మరికొందరు ఈ లీగ్‌కు స్పాన్సర్లుగా వ్యవహరించారు. ఈ లీగ్‌ నిర్వహణకు ముందుకొచ్చి మద్దతునిచ్చిన స్పాన్సర్లకు తానా జాయింట్‌ కోశాధికారి అశోక్‌ కొల్లా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. స్పాన్సర్లు ముఖ్య భూమిక పోషించారని అభినందించారు. నియోటా అధ్యక్షుడు ప్రసాద్‌ మువ్వా మాట్లాడుతూ క్రీడాకారులు, నిర్వాహక  కమిటికీ ధన్యవాదాలు తెలియజేశారు. తానాతో కలసి పనిచేసేందుకు సమ్మతి తెలిపిన నియోటా బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ స్రవంతి వల్లంపాటి, రామరావు అప్పన, గిరిరాజులకు కూడా ధన్యవాదాలు తెలిపారు.

రాజా అబ్బేనగరి, జితేందర్‌ గోలి, మోహన్‌ దేవరపల్లి, అభయ్‌, గిరిష్‌, సరత్‌ కొమ్మినేని, తజుల్‌, దుర్గాప్రసాద్‌, మౌర్య, చేతన్‌, మహేష్‌ అడ్డగడ్డ, రాజు దొడ్డి, నరేష్‌ బొడ్డు, జనార్థన్‌, మౌర్య కేతినేని, గోపీ సైనీ, క్రాంతి, సురేష్‌ పెనుముడిల మద్దతు లేకుండా ఈ లీగ్‌  విజయవంతమయ్యేదికాదని తానా కోశాధికారి అశోక్‌ కొల్లా తెలిపారు. కిషోర్‌ డోకిబుర్ర ఫొటోగ్రఫీ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. విలువైన సమయాన్ని లీగ్‌ నిర్వహణకు వెచ్చించారని అభినందనలు తెలిపారు.

Click here for Event Gallery