కేన్సస్ లో కూచిభొట్ల శ్రీనివాస్ భార్య శాంతియాత్ర

కేన్సస్ లో కూచిభొట్ల శ్రీనివాస్ భార్య శాంతియాత్ర

12-03-2018

కేన్సస్ లో కూచిభొట్ల శ్రీనివాస్ భార్య శాంతియాత్ర

కేన్సస్‌ నగరంలో గత ఫిబ్రవరిలో జాతి విద్వేషానికి బలైపోయిన తెలుగు ఇంజనీరు శ్రీనివాస్‌ కూచిభోట్ల భార్య సునయన దుమాల ఇక్కడ శాంతియాత్రను నిర్వహించారు. తన భర్త శ్రీనివాస్‌ 34వ పుట్టిన రోజైన శుక్రవారం నాడు ఈ యాత్ర నిర్వహించారు. అతడు పనిచేసిన గార్మిన్‌ సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి జాతి విద్వేషాగ్నికి బలైపోయిన బార్‌ వరకూ సుమారు మూడుకిలోమీటర్ల పొడవున ఈ శాంతియాత్ర సాగింది. ఆమె సారథ్యంలో జరిగిన శాంతియాత్రలో శ్రీనివాస్‌ స్నేహితులు, సహోద్యోగులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం శ్రీనివాస్‌ పనిచేసిన గార్మిన్‌ సంస్థ కార్యాలయం వెలుపల హాజరైన వందలాది మందిని ఉద్దేశించి సునయన ప్రసంగించారు. ఓ వ్యక్తి జాతివిద్వేషానికి ఓ అమాయకమైన ప్రాణం బలైపోయింది అటూ ఆమె పేర్కొన్నారు.