కొత్త నినాదాన్ని అందుకున్న ట్రంప్

కొత్త నినాదాన్ని అందుకున్న ట్రంప్

12-03-2018

కొత్త నినాదాన్ని అందుకున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన నినాదాన్ని మార్చారు. అధ్యక్ష ఎన్నికల్లో మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌ నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. ఈ నినాదమే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన గెలుపునకు ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అప్పటి నుంచి ట్రంప్‌ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా, సోషల్‌మీడియాలో ఏ పోస్ట్‌ పెట్టినా, ఈ నినాదాన్ని కనీసం ఒక్కసారైనా వాడతారు. అయితే, తాజాగా ట్రంప్‌ నినాదం మారింది. మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌కి బదులుగా కీప్‌ అమెరికా గ్రేట్‌ అని మార్చారు. ఈ సందర్భంగా అమెరికా కొత్త నినాదాన్ని ట్రంప్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ నినాదాన్ని వాడాను. ఆ నినాదాన్ని నిజం చేసి చూపించాను. కాబట్టి మళ్లీ దానిని వాడాలనుకోవడం లేదు. మరో రెండేండ్ల పాటు కీప్‌ అమెరికా గ్రేట్‌ అనే నినాదం చేస్తాను అని చెప్తూ ఆ నినాదంలో ఉన్న ఆశ్చర్యార్థకాన్ని గాల్లో గీస్తూ చూపించారు ట్రంప్‌.

అమెరికా అధ్యక్షుడిగా బాద్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. ఇప్పుడు అధ్యక్షుడిగా రెండో విడుదత మొదలైంది. 2020లో ట్రంప్‌ని ఎన్నుకోవాలో వద్దో అనేది ఈ రెండేండ్ల పాలన పైనే ఆధారపడి ఉంది. పెన్సిల్వేనియాలో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్‌ బ్యాబినెట్‌కు చెందిన రిక్‌ సాక్కోస్‌ అనే రిపబ్లికన్‌ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ కొత్త నినాదాన్ని ఆవిష్కరించారు.