డొనాల్డ్ ట్రంప్ లాటిన్ అమెరికా పర్యటన

డొనాల్డ్ ట్రంప్ లాటిన్ అమెరికా పర్యటన

12-03-2018

డొనాల్డ్ ట్రంప్ లాటిన్ అమెరికా పర్యటన

అమెరికా అద్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏప్రిల్‌ నెలలో తొలిసారిగా లాటిన్‌ అమెరికా పర్యటనకు వెళ్తున్నారని వైట్‌ హౌస్‌ ప్రకటించింది. ఈ పర్యటనలో ఆయన పెరూ, కొలంబియా దేశాలను సందర్శిస్తారని వైట్‌ హౌస్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. పెరూ రాజధాని లీమాలో జరిగే అమెరికా దేశాల సదస్సుకు ట్రంప్‌ హాజరవుతారని, అనంతరం ఆయన అధ్యక్షుడు పెడ్రో పాబ్లో కుక్జిన్‌స్కీతో భేటీ అవుతారని పేర్కొన్నారు. అదే విధంగా కొలంబియాలో ఆయన అధ్యక్షుడు జువాన్‌ మాన్యుయెల్‌ శాంటోస్‌తో భేటీ అవుతారని వివరించారు. లాటిన్‌ అమెరికా దేశాలలో తొలిసారిగా పర్యటించనున్న ట్రంప్‌ అనేక ద్వైపాక్షిక, బహుళపక్ష, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారని వివరించారు.