అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం
MarinaSkies
Kizen
APEDB

అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం

10-03-2018

అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం

సరదాగా బోటింగ్‌ కోసం వెళ్లిన అతడిని మృత్యువు కబళించింది. తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఈ సంఘటన అమెరికాలోని నార్త్‌ కరోలినా క్యారీలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దేవినేని రాహుల్‌ (19) తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాలో నివాసం ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం స్నేహితులతో కలిసి సరదాగా బోటింగ్‌కు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు పడవ మునిగిపోవడంతో రాహుల్‌, అతని స్నేహితుడు నదిలో పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనలో రాహుల్‌ మృతి చెందాగా, అతని స్నేహితుడు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.