ట్రంప్ ను మించిపోయిన భారతీయడు

ట్రంప్ ను మించిపోయిన భారతీయడు

10-03-2018

ట్రంప్ ను మించిపోయిన భారతీయడు

భారతీయులు వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. మనదేశంలోనే కాకుండా విదేశాల్లో వ్యాపారాలు ప్రారంభించి ఎంతో మంచి పేరు, డబ్బు గడించారు. ఇటీవల ప్రపంచ ధనవంతుల లిస్టులో భారతీయులు కూడా ప్రముఖ స్థానాల్లో నిలుస్తున్నారు. ఫోర్బ్స్‌ పత్రిక వెల్లడించిన ప్రపంచ ధనవంతుల స్థానాల్లో కేరళకు చెందిన యూసఫ్‌ అలీ 388వ స్థానంలో నిలిచారు. భారత్‌లో ఆయన 19వ స్థానంలో నిలిచారని ఫోర్బ్స్‌ వెల్లడించింది. యూసఫ్‌ ప్రస్తుతం దుబాయ్‌లో లూలూ గ్రూప్‌ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన ఆస్తి విలువ సుమారు ఐదు వందల కోట్ల డాలర్లని (దాదాపు 32వేల 552 కోట్ల రూపాయలు ) ఫోర్బ్స్‌ వెల్లడించింది. ఇదిలావుండగా యూసఫ్‌ సంపదలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను మించిపోయాడు. ఫోర్బ్స్‌ వెల్లడించిన ఫలితాల్లో ట్రంప్‌ 544వ స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తి విలువ మూడు వందల కోట్ల డాలర్లు (దాదాపు 19 వేల 531 కోట్ల రూపాయలు) మాత్రమేనని ఫోర్బ్స్‌ తెలిపింది. భారత్‌లో కుబేరుల సంఖ్య ఒక వంద ఇరవై ఒకటని ఫోర్బ్స్‌ చెబుతోంది.