పాక్ పై అమెరికా ఉక్కుపాదం

పాక్ పై అమెరికా ఉక్కుపాదం

10-03-2018

పాక్ పై అమెరికా ఉక్కుపాదం

పాకిస్థానీ ఉగ్రవాదులపై అమెరికా ఉక్కుపాదం మోపింది. ముగ్గురు కీలక ఉగ్ర నాయకుల సమాచారం అందించేవారికి భారీ రివార్డులు ప్రకటించింది. పాక్‌ తాలిబాన్‌ సంస్థ తెహ్రిక్‌-ఈ-తాలిబాన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) అధిపతి మౌలానా ఫజ్లుల్లాపై 5 మిలియన్‌ డాలర్ల ( దాదాపు రూ.32.5 కోట్లు) రివార్డును ప్రకటించింది. అలాగే జమాత్‌ ఉల్‌-అహ్రర్‌ నాయకుడు అబ్దుల్‌ వలీ, లష్కర్‌-ఇ-ఇస్లాం ఉగ్రవాద సంస్థలకు చెందిన మంగల్‌ బాగ్‌లపై 3 మిలియన్‌ డాలర్ల ( సుమారు రూ.19.5 కోట్లు) వంతున రివార్డులు ప్రకటించింది.