మంచు తుపానుతో అగ్రరాజ్యం గజగజ

మంచు తుపానుతో అగ్రరాజ్యం గజగజ

08-03-2018

మంచు తుపానుతో అగ్రరాజ్యం గజగజ

అగ్రరాజ్యం అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. న్యూయార్క్‌, న్యూజెర్సీల్లో విపరీతంగా మంచు కురుస్తోంది. ఎక్కడపడితే అక్కడ మంచు కుప్పలు తెప్పలుగా పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మంచు తుపాను కారణంగా ఇక్కడ విమానాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే న్యూయార్క్‌, న్యూజెర్సీ విమానాశ్రయాల్లో వందల సంఖ్యలో విమానాల రాకపోకలను నిలిపివేశారు. న్యూయ్కార్‌లో ఆరు నుంచి 10 అంగుళాల మేర, న్యూజెర్సీ, కనెక్టికట్‌లలో 20 అంగుళాల మేర మంచు పేరుకుపోయి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుపానుతో పాటు బలమైన గాలలు కూడా వీస్తున్నాయి. దీంతో అదికారులు అత్యవసర సేవలను ముమ్మరం చేశారు.