జుకర్ బర్గ్ దంపతుల భారీ విరాళం

జుకర్ బర్గ్ దంపతుల భారీ విరాళం

08-03-2018

జుకర్ బర్గ్ దంపతుల భారీ విరాళం

ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ దంపతులు 3 కోట్ల డాలర్ల (దాదాపు రూ.195 కోట్లు) భారీ విరాళం ప్రకటించారు. అమెరికాలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో విద్యాభ్యాస సామర్థ్యాన్ని పెంచేందుకు దోహపడేలా హార్వర్డ్‌ యూనివర్సిటీ, మస్సాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటి)కి వారు ఈ నిధులు అందించనున్నారు. హార్వర్డ్‌లో చదువుకుంటున్న సమయంలోనే జుకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌ పేరుతో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్‌ను డిజైన్‌ చేశారు. అయితే తాను చదువు మధ్యలోనే  వదిలేశాడు. తన భార్య ప్రిస్కిల్లా చాన్‌ 2007లో ఐవీ లీగ్‌ స్కూల్‌ నుంచి డిగ్రీ పూర్తి చేశారు.