ట్రంప్ ఆర్థిక సలహాదారు కోన్ రాజీనామా

ట్రంప్ ఆర్థిక సలహాదారు కోన్ రాజీనామా

08-03-2018

ట్రంప్ ఆర్థిక సలహాదారు కోన్ రాజీనామా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సలహాదారుల జాబితా నుంచి మరో వ్యక్తి వైదొలిగారు. వైట్‌హౌస్‌ ఆర్థిక ముఖ్యసలహాదారు పదవి నుంచి గ్యారీ కోన్‌ తప్పుకున్నారు. ట్రంప్‌ చేపడుతున్న వివాదాస్పద వాణిజ్య విధానాలతో గత కొంతకాలంగా విభేదిస్తున్న కోన్‌ చివరకు రాజీనామా చేసి వైట్‌హౌస్‌ నుంచి వెళ్లిపోయారు. గ్యారీ కోన్‌ వైట్‌హౌస్‌ నేషనల్‌ ఎకనామిక్‌ కౌన్సిల్‌ డైరెక్టర్‌గా సేవలందించారు. దిగుమతి చేసుకునే స్టీలుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం పన్ను విధిస్తూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని గ్యారీ కోన్‌ వ్యతిరేకించారు.