ఎన్నారైల సహకారంతో డిజిటల్‌ తరగతులు...

ఎన్నారైల సహకారంతో డిజిటల్‌ తరగతులు...

07-03-2018

ఎన్నారైల సహకారంతో డిజిటల్‌ తరగతులు...

 

దేశాభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి  జయరాం కోమటి నేతృత్వంలో కొండపల్లి జడ్పీ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్‌ తరగతుల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ విద్య లేకపోతే వ్యక్తిగతంగా, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడం కష్టంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో అనుకున్న మేర విద్యాభివృద్ధి సాధించలేదని అన్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యకు ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మాతృభూమి కోసం ఎన్‌ఆర్‌ఐలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

   రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 5000 పాఠశాల్లో డిజిటల్‌ తరగతులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వాటిలో 2700లో పూర్తి చేసినట్లు తెలిపారు. విద్యార్థులు డిజిటల్‌ తరగతులు సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించి ఉత్తములుగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం, సర్వశిక్ష అభియాన్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌, జిల్లా విద్యాశాఖ అధికారులు, జడ్పీటీసీ సభ్యురాలు చెన్నుబోయిన రాధ, ఎంపీపీ గెత్తం కుమారి, వైస్‌ ఎంపీపీ చెరుకూరి వెంకటకృష్ణ, సర్పంచ్‌ వెనిగళ్ల అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.