భారత ఎంబసీ పేరుతో మోసాలు!

భారత ఎంబసీ పేరుతో మోసాలు!

06-03-2018

భారత ఎంబసీ పేరుతో మోసాలు!

అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి చెందిన టెలిఫోన్‌ లైన్లను అనుకరించి కొందరు మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ పోన్‌ లైన్ల ద్వారా అమెరికాలోని ప్రవాస భారతీయులను డబ్బు కోసం డిమాండ్‌ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇతర మోసాలు చేస్తున్నారని భారత ఎంబసి కార్యాలయం వెల్లడించింది. ఈ విషయంపై భారత ఎంబసీ అమెరికా ప్రభుత్వానికి సమాచారం అందించింది. అలాగే రాయబార కార్యాలయం అంతర్గత విచారణ ప్రారంభించింది. దీనిపై జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. డబ్బు కోసం దుండగులు ఇలాంటి పనిచేస్తున్నారని తెలిపారు.