ట్రంప్ నిర్ణయంతో మరో ఇబ్బంది

ట్రంప్ నిర్ణయంతో మరో ఇబ్బంది

06-03-2018

ట్రంప్ నిర్ణయంతో మరో ఇబ్బంది

దేశీయ స్టీల్‌ పరిశ్రమను ప్రోత్సహించాలని ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మరో రూపంలో ఇబ్బందికరంగా మారింది. అమెరికాలో అత్యంత కీలకమైన షెల్‌ ఇంధన పరిశ్రమకు గుదిబండగా మారనుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్టీల్‌పై 25 శాతం సుంకం విధించాలని ఆయన నిర్ణయించారు. కానీ ఈ నిర్ణయం ఒపెక్‌, రష్యాలకు ఉపయోపడుతుంది కానీ దేశానికి ఏమాత్రం ఉపయోగపడదని షెల్‌ పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచంలో అమెరికాను అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా తీర్చిదిద్దాలనే కల ఈ నిర్ణయంతో సాధ్యంకాకపోవచ్చని భావిస్తున్నారు. ఆయిల్‌ సరఫరాకు అమెరికాలో భారీ ఎత్తున పైప్‌లైన్లను నిర్మించాల్సి ఉంది. అమెరికాలోని ఐదు పైప్‌లైన్‌ సంస్థలు వాడే స్టీల్‌లో 77 శాతం దిగుమతి చేసుకుందే. ముఖ్యంగా డకోటా పైప్‌లైన్‌ ప్రాజెక్టు దీని నుంచి తీవ్రంగా ప్రభావితం కానుంది. ఈ నిర్ణయంతో అమెరికాలోని పలు ప్రాజెక్టుల వ్యయం కూడా పెరగనుంది. దీంతో ప్రాజెక్టులను మధ్యలోనే ఆపివేయడమే లేకపోతే, నిలిపివేయడమో చేయాల్సిన పరిస్థితి నెలకొంది.