లాస్ఏంజెల్స్‌లో 'ప్రజా సంకల్పయాత్ర' శతదినోత్సవం

లాస్ఏంజెల్స్‌లో 'ప్రజా సంకల్పయాత్ర' శతదినోత్సవం

05-03-2018

లాస్ఏంజెల్స్‌లో 'ప్రజా సంకల్పయాత్ర' శతదినోత్సవం

అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో ప్రజాసంకల్పయాత్ర శతదినోత్సవాన్ని వైఎస్‌ఆర్‌సిపి  ప్రవాసాంధ్ర కార్యకర్తల సమక్షంలో జరిపారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వైసిపి ప్రకటించిన నవరత్న పథకాలపై ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కార్యకర్త ఈ ఏడాది మరింత కష్టపడాలని సూచించారు. ప్రజాసంకల్పయాత్ర శతదినోత్సవ వేడుకలో భాగంగా కేక్‌ కట్‌ చేశారు.