అమెరికాలో రైలీ తుపాను బీభత్సం

అమెరికాలో రైలీ తుపాను బీభత్సం

05-03-2018

అమెరికాలో  రైలీ తుపాను బీభత్సం

అమెరికాలోని 12 రాష్ట్రాల్లో  రైలీ తుపాన్‌ బీభత్సం సృష్టించింది. ఈ తుఫాన్‌ ధాటికి ఇప్పటి వరకూ ఏడుగురు మృతి చెందారు. విద్యుత్‌ వ్యవస్థ కుప్పకూలి 23 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. న్యూయార్క్‌, వర్జీనియా, మసాచూసెట్స్‌, మేరీల్యాండ్‌  సహా మరికొన్ని రాష్ట్రాలపై ఎడతెరిపిలేని వర్షం, తీవ్రమైన హిమపాతం భీకర గాలులతో రైలీ తుపాను విరుచుకుపడింది. వేర్వేరు రాష్ట్రాల్లో చెట్లు విరిగి పడిన ఘటనల్లో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పెనుగాలుల కారణంగా విద్యుత్‌ స్తంభాలు నేలకూలిపోగా, ఎక్కడికక్కడ విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.