అమెరికా ప్రథమ మహిళకు గ్రీన్ కార్డు
Sailaja Reddy Alluddu

అమెరికా ప్రథమ మహిళకు గ్రీన్ కార్డు

05-03-2018

అమెరికా ప్రథమ మహిళకు గ్రీన్ కార్డు

అమెరికా ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్‌కు అధికారులు ఐన్‌స్టీన్‌ వీసాగా పిలిచే గ్రీన్‌ కార్డును జారీ చేశారు. ఈబీ-1 ప్రోగ్రాంలో భాగంగా మెలానియాకు గ్రీన్‌ కార్డు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. సైన్స్‌, కళలు,  విద్య, వ్యాపార రంగాలతో పాటు అథ్లెటిక్స్‌లో అసాధారణ శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ వీసాను జారీ చేస్తారు. అకడమిక్‌ రీసెర్చర్లు, దేశ, విదేశాల్లో కీర్తి ప్రతిష్టలు అందుకున్న వారికే ఈ ఐన్‌స్టీన్‌ వీసాను ఇవ్వడం జరుగుతుందని చట్ట సభ్యులు పేర్కొన్నారు. 2006లో అమెరికా పౌరసత్వాన్ని అందుకున్న మెలానియాకు తాజాగా ఇతరులతో పాటు ఐన్‌స్టీన్‌ వీసాను అందజేశారు. ఇమిగ్రేషన్‌ వీసాలపై ట్రంప్‌ సర్కారు ఉక్కు పాదం మోపుతున్న సమయంలో మోలానియాకు ఈ వీసా జారీ చేయడం తీవ్ర చర్చనీయమైంది. మరో వైపు అత్యంత ప్రతిభావంతులకు మాత్రమే ఇచ్చే ఈ వీసాకు తానెలా అర్హురాలినన్న విషయాన్ని చెప్పేందుకు మెలానియా నిరాకరించారు.