భారత మార్కెట్లోకి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ

భారత మార్కెట్లోకి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ

03-03-2018

భారత మార్కెట్లోకి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ

ప్రపంచంలోని అగ్రశ్రేణి ఫిల్మ్‌ స్కూల్‌ అయిన న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీ (ఎన్‌వైఎఫ్‌ఎ) భారత్‌లోకి అడుగుపెట్టింది. అమెరికా లోని క్యాంపస్‌లో అందిస్తున్న మూడు పూర్తి స్థాయి ప్రొగ్రామ్స్‌ను, ఇకపై భారత్‌లో అందించనున్నట్లు ఎన్‌వైఎఫ్‌ఎ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డేవిడ్‌ క్లీన్‌ వెల్లడించారు. యాక్టింగ్‌, స్టోరీ రైటింగ్‌, డైరెక్షన్‌ విభాగాల్లో ఈ కోర్సులను ఆఫర్‌ చేయనున్నట్లు ఆయన తెలిపారు. 2011లో తొలిసారిగా భారత్‌లో వర్క్‌ షాప్‌ను నిర్వహించామని, దీనికి మంచి స్పందన లభించిందన్నారు. 4 వారాలు, 8 వారాల పాటు ఈ విభాగాల్లో శిక్షణను అందించనున్నట్లు తెలిపారు. ఇందులో 4 వారాల శిక్షణకు 3.17 లక్షల రూపాయలు, ఎనిమిది వారాల శిక్షణకు 5.25 లక్షల రూపాయల ఫీజును వసూలు చేయనున్నట్లు డేవిడ్‌ తెలిపారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన తరుణ్‌ భాస్కర్‌ దాస్యం, నాగ చైతన్య, నారా రోహిత్‌, క్రిష్‌ జె సత్తార్‌, పన్నాగ భరణ, రాజేష్‌ వర్రె ఎన్‌వైఎఫ్‌లో శిక్షణ పొందిన వారేనని డేవిడ్‌ తెలిపారు.