భారత శాస్త్రవేత్తకు భారీ గ్రాంటు

భారత శాస్త్రవేత్తకు భారీ గ్రాంటు

03-03-2018

భారత శాస్త్రవేత్తకు భారీ గ్రాంటు

క్యాన్సర్‌పై అపూర్వ పరిశోధనలు చేపట్టిన ఇండో అమెరికన్‌ సైంటిస్టు నవీన్‌ వరదరాజన్‌కు 11 లక్షల డాలర్ల గ్రాంటు ప్రకటించారు. భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త వరదరాజన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హుస్టన్‌లో మరో పరిశోధకుడు సంఘ్యూక్‌ ఛుంగ్‌తో కలిసి ప్రాణాంతక క్యాన్సర్‌ విశేష పరిశోధనలు చేపట్టారు. ఈ పరిశోధనలకు గుర్తింపుగా అమెరికాలోని క్యాన్సర్‌ ప్రివెన్షన్‌ అండ్‌ రిసర్ట్‌ ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ టెక్సాస్‌ (సిపిఆర్‌ఐటి) ఈ సహాయ నిధిని మంజూరు చేసింది. క్యాన్సర్‌ మూల కారణాలు, నివారణ చికిత్సలకు ఈ సంస్థ అమెరికాలో భారీ స్థాయిలో నిధులు సమకూరుస్తోంది. హుస్టన్‌ వర్సిటీలో ఓ బయోమాలిక్యులర్‌ ఇంజనీరింగ్‌ సహాయక ప్రొఫెసర్‌ అయిన వరదరాజన్‌ టి-సెల్‌ ఇమ్యూనోథెరపిలో విస్తృత పరిశోధనలు సాగించేందుకు ఈ నిధులను సమకూర్చారని ప్రకటనలో వెల్లడించారు.