ట్రంప్ కుమారుడికి కవర్ పంపిన వ్యక్తి అరెస్ట్
Sailaja Reddy Alluddu

ట్రంప్ కుమారుడికి కవర్ పంపిన వ్యక్తి అరెస్ట్

03-03-2018

ట్రంప్ కుమారుడికి కవర్ పంపిన వ్యక్తి అరెస్ట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారుడు ట్రంప్‌ జూనియర్‌ ఇంటికి ఇటీవల వచ్చిన ఓ కవర్‌ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కవర్‌ పంపించిన వ్యక్తిని ఎఫ్‌బీఐ అధికారులు పట్టుకున్నారు. మసాచుసెట్స్‌కు చెందిన డేనియల్‌ ఫ్రిసీల్లో ఈ ఎన్వెలప్‌ పంపినట్లు గుర్తించారు. అందులో బెదిరింపు లేఖతో పాటు ఏదో తెల్లని పౌడర్‌ పంపించాడు. మసాచుసెట్స్‌లోని బీవెర్లీ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల డేనియల్‌ ఇలా బెదిరింపు లేఖలను అయిదుగురికి పంపిచినట్టు గుర్తించారు. ట్రంప్‌ జూనియర్‌కు పంపిన లేఖలో ఆయన చాలా భయంకరమైన వ్యక్తి అని, ఆయనను తీవ్రంగా ద్వేషిస్తున్నానని రాశాడు.