టీ హబ్ ను సందర్శించిన అమెరికా రాయబారి

టీ హబ్ ను సందర్శించిన అమెరికా రాయబారి

03-03-2018

టీ హబ్ ను సందర్శించిన అమెరికా రాయబారి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్‌ అద్భుత ఆవిష్కరణలకు కేంద్రమని భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్‌ జస్టర్‌ ప్రశంసించారు. ఐటీలోని నూతన ఆవిష్కరణలైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, రోబోటిక్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌  సహా పలు నూతన పోకడలపై టీ హబ్‌లో జరుగుతున్న ఆవిష్కరణలు గొప్ప మలుపునకు శ్రీకారం చుడుతాయని ఆకాంక్షించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన జస్టర్‌ టీ హబ్‌ను సందర్శించి టీ హబ్‌ ప్రతినిధులతో ముచ్చటించారు. గొప్ప ఆవిష్కరణలకు వేదికగా టీ హబ్‌ నిలిచిందని కొనియాడారు. టీ బ్రిడ్జ్‌ పేరుతో అమెరికా సిలికాన్‌ వ్యాలీలోని ఆవిష్కర్తలను కూడా ప్రోత్సహించేలా నిర్ణయం తీసుకోవడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ క్యాథరిన్‌ హడ్డా, సైయంట్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.