పాక్ తీరు ఇంకా మారలేదు : అమెరికా

పాక్ తీరు ఇంకా మారలేదు : అమెరికా

01-03-2018

పాక్ తీరు ఇంకా మారలేదు : అమెరికా

ఉగ్రవాదుల అణచివేతకు పాకిస్థాన్‌ ఇంకా కృతనిశ్చయంతో కూడిన చర్యలు తీసుకోవడం లేదని అమెరికా సైన్యాధికారి జోసఫ్‌ వోటెల్‌ తెలిపారు. పాక్‌కు అమెరికా నుంచి భద్రతాపరమైన ఆర్థికసాయం నిలిపివేత కొనసాగుతుందని  చెప్పారు. ట్రంప్‌ అమెరికా దేశాధ్యక్షుడైన తరువాత తాలిబన్‌, హక్కానీ వంటి ఉగ్రవాద సంస్థలపై కఠినచర్యలు తీసుకోవాలని పాక్‌ను కోరారు. అయినా పాక్‌ ఆశించిన మేరకు చర్యలు చేపట్టలేదు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం మానుకోలేదు. దాంతో పాక్‌కు ఇచ్చే రెండు బిలియన్‌ డాలర్ల ఆర్థికసాయాన్ని ట్రంప్‌ నిలిపి వేశారు. ఇది జరిగి చాలాకాలమైనా పాక్‌ ధోరణిలో మార్పు రాలేదని, పరిస్థితి ఇంకా అలాగే ఉన్నదని చెప్పారు. పాక్‌కు ఆర్థికసాయం నిలిపివేత ఎంతకాలం కొనసాగుతుందని సెనేట్‌ ఆర్మ్‌డ్‌ సర్వీసెస్‌ కమిటీ సభ్యులు అడిగినపుడు ఆయన ఈ విషయం తెలిపారు.