అధ్యక్షుడి అల్లుడికి షాక్ !
MarinaSkies
Kizen
APEDB

అధ్యక్షుడి అల్లుడికి షాక్ !

28-02-2018

అధ్యక్షుడి అల్లుడికి షాక్ !

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఆయన టాప్‌ లెవల్‌ సెక్యురిటీ క్లియరెన్స్‌లో విఫలమయ్యాయరు. అంటే అమెరికాకు చెందిన అత్యంత కీలకమై రహస్య సమాచారాలను తెలుసుకునే అనుమతి ఉండదు. ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ భర్త కుష్నర్‌. 37 ఏళ్ల కుష్నర్‌ ట్రంప్‌ యంత్రాంగంలో కీలక వ్యక్తిగా పనిచేస్తున్నారు. ట్రంప్‌కు సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. అయితే కుష్నర్‌ ఉన్నత స్థాయి సెక్యురిటీ క్లియరెన్స్‌లో విఫలమవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆయన టాప్‌ సీక్రెట్‌/ సెన్సిటివ్‌ కంపార్ట్‌మెంటెడ్‌ ఇన్ఫర్మేషన్‌ తెలుసుకునే అవకాశం కోల్పోయారని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. కానీ వైట్‌హౌస్‌ గానీ, అధ్యక్షుడు ట్రంప్‌ గానీ దీనిపై స్పందించలేదు.