తేలు విషంతో కీళ్లవాతానికి చెక్

తేలు విషంతో కీళ్లవాతానికి చెక్

28-02-2018

తేలు విషంతో కీళ్లవాతానికి చెక్

తేలు కుడితే ప్రాణానికే ప్రమాదం. దాని విషయం నాడుల్ని దెబ్బతీసి నాలుగు గంటల్లో మనిషిని చంపేస్తుంది. అయితే, తేలు విషంతోనూ లాభాలున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. విషయంలో ఉండే ఒక సమ్మేళనం కీళ్ల నొప్పులను దూరం చేస్తుందని, దుష్ప్రభావాలూ ఉండవని చెబుతున్నారు. కీళ్లలో ఉండే ఫైబ్రోబ్లాస్ట్‌ లైక్‌ నైనోవియోసైట్స్‌ కణాలు, రోగనిరోధక కణాలను ఆకర్షించి నొప్పులకు గురిచేస్తాయి. దాంతో కీళ్లవాతం వస్తుంది. దాన్ని తగ్గించేందుకు తేలు విషంలో ఉండే ఐబెరియోటాక్సిన్‌ అనే సమ్మేళనం దోహదపడుతుందని అమెరికాలోని బేలర్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు వెల్లడించారు.