ఆయుధం లేకున్నా కాపాడేందుకు వెళ్లేవాణి

ఆయుధం లేకున్నా కాపాడేందుకు వెళ్లేవాణి

28-02-2018

ఆయుధం లేకున్నా కాపాడేందుకు వెళ్లేవాణి

తన వద్ద ఆయుధం లేకపోయినా సరే విద్యార్థులను కాపాడడానికి ఫ్లోరిడా స్కూల్‌లోకి వెళ్లేవాడినని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ఫ్లోరిడాలో ఓ పాఠశాలలో మాజీ విద్యార్థి కాల్పులు జరిపి 17 మందిని బలిగొన్న సంగతి తెలిసిందే. మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. వైట్‌హౌస్‌లో గవర్నర్లతో సమావేశమైన ట్రంప్‌ ఈ ఘటనపై స్పందించారు. మీరు నన్ను పరీక్షించే నమ్మలేరు, కానీ అలాంటి పరిస్థితుల్లో ఆయుధం లేకున్నా నేను కాపాడడానికి వెళ్లేవాడిని. నాకు నాపై ఆ విశ్వాసం ఉంది. ఇక్కడ చాలా మంది కూడా అదే చేసేవారు. ఎందుకంటే మీలో చాలా మంది నాకు తెలుసు. కానీ ఘటనాస్థలంలో మాత్రం పలువరు చాలా అవమానకరంగా ప్రవర్తించారని అన్నారు. పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇలాంటివి జరగకుండా దీర్ఘాకాలిక చర్యలు అవసరమని పేర్కొన్నారు. స్కూల్‌ సిబ్బందిలో శిక్షణ పొందిన, తగిన ధ్రువీకరణ పత్రం కలిగిన వారి వద్ద ఆయుధాలు ఉంచాలని సూచించారు.