భారత్ తో బలమైన బంధాన్ని కోరుకుంటున్నాం
Agnathavasi
Ramakrishna

భారత్ తో బలమైన బంధాన్ని కోరుకుంటున్నాం

11-03-2017

భారత్ తో బలమైన బంధాన్ని కోరుకుంటున్నాం

భారతదేశంతో బలమైన సంబంధాలను కోరుకుంటున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌ యంత్రాంగం భారతదేశంతో బలమైన సంబంధాలను కోరుకుంటున్నట్లు తెలిపింది. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపరిచేందుకు ఇరు దేశాలు కృషి చేస్తాయని విశ్వసిస్తున్నట్లు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరి సీన్‌ స్పైసర్‌  మీడియా సమావేశంలో వెల్లడించారు. గతంలో తెలిపినట్టే భారత ప్రధాని నరేంద్ర మోడీతోనూ, అమెరికా భారత్‌ వ్యాపారాల్లోనూ సంబంధాలను మరింత బలపరిచే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. తమ విదేశీ విధానాల పట్ల ముందుకెళ్తున్న క్రమంలో భారత్‌తో మంచి సంబంధాల కొనసాగింపు గురించి అధ్యక్షుడు ట్రంప్‌ తరుచూ ప్రస్తావిస్తారని ఆయన వెల్లడించారు. కాన్సాస్‌లో 32 ఏళ్ల తెలుగు యువకుడు శ్రీనివాస్‌ హత్య స్పైసర్‌ ఖండించారు. దేశ విలువను కాపాడేందుకు అమెరికన్లంతా కలిసి ఉండాలని ఆయన కోరారు. కొన్ని పాలసీల విషయంలో విభేదించినప్పటికి మరికొన్ని పాలసీలు మనల్ని కలిపి ఉంచుతాయని అయన అన్నారు.