తానా ఆశయానికి అండగా 15వేలమందికి పైగా హాజరు
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

తానా ఆశయానికి అండగా 15వేలమందికి పైగా హాజరు

14-02-2018

తానా ఆశయానికి అండగా 15వేలమందికి పైగా హాజరు

ఖమ్మంలో తానా 5కె రన్‌ జయప్రదం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో క్యాన్సర్‌పై అవగాహనకోసం ఖమ్మంలో 11వ తేదీన నిర్వహించిన 5కె రన్‌ విజయవంతమైంది. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంట్‌ సభ్యుడు పంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అజయ్‌ కుమార్‌, ఎమ్మెల్సి లక్ష్మీనారాయణ తదితరులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైయ్యారు. తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ జే తాళ్ళూరి, తానా ఫౌండేషన్‌ అధ్యక్షుడు శంగవరపు నిరంజన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హాజరయ్యేందుకు ఎంతోమంది ఉత్సాహం చూపారు.

తానా ఆశయానికి తాము కూడా జతకడుతున్నట్లు ప్రకటించి, దాదాపు 15వేలమందికిపైగా జనాలు ఈ రన్‌లో పాల్గొన్నారు.  వేల సంఖ్యలో పాల్గొన్న ఈ రన్‌ జరిగే సమయంలో ట్రాఫిక్‌ ను నియంత్రించేందుకు పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోకి దిగారంటే జనసందోహాన్ని అంచనా వేయవచ్చు. ఉదయం నాలుగింటికి నుంచే నగరంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియానికి వేెల సంఖ్యలో  ప్రజలు తరలి వచ్చారు. సినీతారలు శ్రీకాంత్‌, శివాజీ రాజా, శ్రీనివాస్‌ రెడ్డి, హేమ, తారకరత్న, సురేష్‌, అనితా చౌదరి, ఉత్తేజ పరచారు. సినీ నటుడు శ్రీకాంత్‌ మాట్లాడుతూ గతంలో తానూ పలుమార్లు ఖమ్మం వచ్చానని ఇప్పుడు ఇక్కడి అభివద్ధి చూస్తే ఆనందంగా ఉందని అన్నారు. ప్రజలతో మమేకమై కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు క షి చేసిన ఎమ్మెల్యే పువ్వాడ చొరవను వారు ప్రత్యేకంగా అభినందించారు.

కార్యక్రమంలో కలెక్టర్‌ లోకేష్‌ కుమార్‌, జడ్పీ అధ్యక్షురాలు గడిపల్లి కవిత, నగర మేయర్‌ పాపాలాల్‌, కమిషనర్‌ సందీప్‌ కుమార్‌ ఝూ, ఆర్డీవో పూర్ణ చంద్ర కురివెల్ల ప్రవీణ్‌ కుమార్‌తోపాటు దొడ్డారవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి సహకారంతో క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ క్యాంప్‌ను కూడా నిర్వహించింది. రాకేష్‌ బత్తినేని, బత్తినేని ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారందరికీ ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ జే తాళ్ళూరి, తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ శృంగవరపు ధన్యవాదాలు తెలిపారు.

Click here for Event Gallery