ఎపిపై వివక్ష వద్దు - నాట్స్

ఎపిపై వివక్ష వద్దు - నాట్స్

14-02-2018

ఎపిపై వివక్ష వద్దు - నాట్స్

ఆంధ్రప్రదేశ్‌ కు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ లో సరైన నిధులు కేటాయించకపోవడంపై నార్త్‌ అమెరికా తెలుగు సంఘం (నాట్స్‌) నిరసన వ్యక్తం చేసింది. విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలుపై కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి యావత్‌ తెలుగు ప్రజలను మనోవేదనకు గురి చేస్తుందని నాట్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ కు రైల్వేజోన్‌, రెవిన్యూ లోటు భర్తీ అంశాలపై కేంద్రం ఇంకా నాన్చుడు ధోరణి అవలంభించడాన్ని నాట్స్‌ ఖండించింది.. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన కేంద్రం.. ఆ ప్యాకేజీ ప్రయోజనాలను ఇంతవరకు అందించపోవడం ఎంతవరకు సమంజసం అని నాట్స్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ గుత్తికొండ ప్రశ్నించారు.

ప్రపంచంలో తెలుగువారికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా నాట్స్‌ స్పందిస్తుందన్నారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ ను ఉదారంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కు ఇచ్చిన హామీల కోసం తెలంగాణ ఎంపీలు కూడా మద్దతు పలకడాన్ని ఆయన స్వాగతించారు. ఇలాంటి సమయాల్లో తెలుగువారు ఎక్కడ ఉన్నా అంతా ఏకతాటిపైకి వచ్చి తమ వాణిని వినిపించాల్సిన అవసరముందని . తక్షణమే కేంద్రం ఏపీకి కేంద్ర బడ్జెట్‌ లో నిధులు పెంచాలని.. ఏపీ చేస్తున్న డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి న్యాయం చేయాలని నాట్స్‌ ప్రెసిడెంట్‌ మోహన కష్ణమన్నవ, చైర్మన్‌ శ్రీనివాస్‌ గుత్తికొండ కోరారు.