దిగ్విజయంగా ఖమ్మంలో తానా 5కె రన్

దిగ్విజయంగా ఖమ్మంలో తానా 5కె రన్

12-02-2018

దిగ్విజయంగా ఖమ్మంలో తానా 5కె రన్

తానా ఆద్వర్యంలో ఖమ్మంలో 11వ తేదీన నిర్వహించిన 5k రన్ దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంట్ సభ్యుడు పంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అజయ్ కుమార్, ఎమ్మెల్సి లక్ష్మీనారాయణ తదితరులు ముఖ్య అతిధులుగా హాజరైయ్యారు. తానా తదుపరి అద్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, తానా ఫౌండేషన్ అద్యక్షుడు శృంగవరపు నీరంజన్లు, తానా తరపున నేతృత్వం వహించారు.

ట్రాఫిక్ ను నియంత్రించేందుకు పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోకి దిగారంటే జనసందోహాన్ని అంచనా వేయవచ్చు. ఉదయం నాలిగింటికి నించే నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియానికి వెలది సంఖ్యలో పరుగులో పాల్గొనేందుకు వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రజలు వచ్చారు. సినీతారలు శ్రీకాంత్, శివాజీ రాజా, శ్రీనివాస్ రెడ్డి, హేమ, తారకరత్న, సురేష్, అనితా చౌదరి, ఉత్తేజ పరచారు. కార్యక్రమంలో కలెక్టర్ లోకేష్ కుమార్, జడ్పీ అధ్యక్షురాలు గడిపల్లి కవిత, నగర మేయర్ పాపాలాల్, కమిషనర్ సందీప్ కుమార్ ఝూ, ఆర్డీవో పూర్ణచంద్ర కురివెల్ల ప్రవీణ్ కుమార్, దొడ్డారవి తదితరులు పాల్గొన్నారు.