వారికి 6 శాతం గ్రీన్ కార్డులే!

వారికి 6 శాతం గ్రీన్ కార్డులే!

09-02-2018

వారికి 6 శాతం గ్రీన్ కార్డులే!

అమెరికా ప్రభుత్వం 2016లో జారీ చేసిన గ్రీన్‌కార్డులో 6 శాతమే ఉద్యోగ ఆధారిత విభాగాలకు చెందాయట. వీటి కోసం భారత్‌కు చెందిన నిపుణులైన ఉద్యోగులు ఐదేళ్ల కంటే ఎక్కువగా ఎదురు చూడాల్సి వస్తోందని అధికార రిపబ్లికన్‌ పార్టీ ఓ నివేదికలో తెలిపింది. నవంబరు 2017 నాటికి ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల కోసం 1.12 లక్షల మంది ఎదురుచూస్తున్నట్లు వివరించింది. 2016లో 12 లక్షల గ్రీన్‌కార్డులు జారీచేయగా, అందులో 1.40 లక్షల ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డులు ఉన్నట్లు వివరించారు. ఇది మొత్తం కార్డుల్లో కేవలం 12 శాతమని తెలిపింది. వీటిలోనూ సగం కార్డులు ఉద్యోగుల భార్యపిల్లలకే సరిపోయాయని పేర్కొంది.