ఖమ్మంలో 'తానా' 5కె రన్
APEDB
Ramakrishna

ఖమ్మంలో 'తానా' 5కె రన్

08-02-2018

ఖమ్మంలో 'తానా' 5కె రన్

తానా ఆధ్వర్యంలో ఖమ్మంలో 5కె రన్‌ను నిర్వహిస్తున్నారు. తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, తానా ఫౌండేషన్ చైర్మన్ శృంగవరపు నిరంజన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి “మా” భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ MLA, దొడ్డా రవి, కాటేపల్లి నవీన్ తదితరులు హాజరు కానున్న ఈ కార్యక్రమంలో లాకారం ట్యాంక్‌బండ్‌ను ఖమ్మంలో ఆవిష్కరించనున్నారు. ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి-తానా ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరం, పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జయశేఖర్ తెలిపారు.