విద్యుత్ ప్రకంపనలతో జ్ఞాపకశక్తి

విద్యుత్ ప్రకంపనలతో జ్ఞాపకశక్తి

08-02-2018

విద్యుత్ ప్రకంపనలతో జ్ఞాపకశక్తి

మెదడుకు ఎడమ వైపున ఎలక్ట్రికల్‌ స్టిమ్యులేషన్‌ చేస్తే జ్ఞాపకశక్తి మెరుగవుతుందని పరిశోధనలో తేలింది. మెదడు పనితీరును పరిశీలించేందుకు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాకు చెందిన పరిశోధకులు ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేశారు. దీని ద్వారా విద్యుత్‌ ప్రకంపనలను పంపిస్తే మెదడు పనితీరు 15శాతం పెరగడంతో పాటు జ్ఞాపకశక్తి పెరిగినట్లు గుర్తించారు. 25 మంది న్యూరోసర్జికల్‌ రోగులపై పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు తెలిపారు.