ప్రపంచానికి అమెరికా సైన్యం సవాల్!

ప్రపంచానికి అమెరికా సైన్యం సవాల్!

08-02-2018

ప్రపంచానికి అమెరికా సైన్యం సవాల్!

అగ్రరాజ్యం అమెరికా ప్రపంచ దేశాలకు తమ సైనిక సత్తాను చూపించాలనుకుంటోంది. ఇందుకోసం అమెరికా సంప్రదాయంలో లేనివిధంగా సైనిక కవాతు నిర్వహించనుంది. దేశాధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాల మేరకు పెంటగాన్‌ ఇందుకు సన్నాహాలు చేస్తోంది. భారత్‌, చైనా, ఫ్రాన్స్‌ వంటి దేశాల్లో ఏటా మిలటరీ పరేడ్‌ జరుగుతుండగా, అమెరికాలో ఇప్పటివరకు ఈ సంప్రదాయం లేదు. కానీ, ట్రంప్‌ ఈ ఏడాది కవాతు నిర్వహించాలని నిర్ణయించారు. నిరుడు ఫ్రాన్స్‌ బ్యాస్టిల్‌ డే వేడుకలకు హాజరైన ట్రంప్‌ వారి సైన్యం పరేడ్‌ను చూసి ముచ్చటపడినట్లు, అప్పుడే తమ సైన్యంతోనూ నిర్వహించాలని నిర్ణయించినట్లు వైట్‌హౌస్‌ వర్గాలు పేర్కొన్నాయి. దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్న సైనికుల పట్ల ట్రంప్‌కు ఎంతో గౌరవం ఉంది. ఆయనతోపాటు దేశ ప్రజలందరూ వారి పట్ల తమ కృతజ్ఞతలు చాటుకునేలా గొప్ప వేడుక నిర్వహించాలని కోరారు అని వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి సారా శాండర్స్‌ తెలిపారు.