వణికించిన అమెరికా!

వణికించిన అమెరికా!

07-02-2018

వణికించిన అమెరికా!

అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్లలో మొదలైన ముసలానికి బడ్జెట్‌ ప్రకంపనలూ తోడవటంతో మంగళవారం మన స్టాక్‌ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. వరుసగా ఆరో ట్రేడింగ్‌ సెషన్‌లో స్టాక్‌ సూచీలు పతనం బాటే పట్టాయి. మన మార్కెట్‌ మొదలయ్యే సమయానికే ప్రపంచ మార్కెట్లన్నీ రెడ్‌ జోన్లోకి వెళ్లాయి. అదే తీరులో మన మార్కెట్లూ దారుణంగా పడి.. ఒకదశలో సెన్సెక్స్‌ 1270, నిఫ్టీ 390 పాయింట్లు నష్టపోయాయి. చివరికి కాస్త తేరుకుని సెన్సెక్స్‌ 561, నిఫ్టీ 168 పాయింట్ల నష్టపోయాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ ఈ ఒక్క రోజే రూ.2.7 లక్షల కోట్లు  ఆవిరైపోయింది. మొత్తం మీద గడిచిన ఆరు సెషన్లలో ఏకంగా రూ.10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది.