ట్రంప్ కు మెలానియా మళ్లీ షాక్

ట్రంప్ కు మెలానియా మళ్లీ షాక్

06-02-2018

ట్రంప్ కు మెలానియా మళ్లీ షాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేయి అందించడం అందుకు ఆయన సతీమణి మెలానియా మీడియా ముందే నిరాకరించడం గతేడాది రెండు సార్లు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ అదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. ఈ సారి స్వదేశంలోనే తన ఇంటి ముందే ఎదురైంది. ట్రంప్‌, మెలానియాతో కలిసి ఒహైయో బయల్దేరారు. ఆ సమయంలో విమానం ఎక్కేందుకు శ్వేతసౌధం నుంచి ఇద్దరు కలిసి వస్తుండగా, ట్రంప్‌ మెలానియా చేతిని పట్టుకుని నడిచేందుకు ప్రయత్నించారు. కానీ మెలానియా ఆయనకు చేయి అందించలేదు. ఆమె తన చేతులను కప్పేసేలా పొడవాటి ఓవర్‌కోట్‌ ధరించడంతో మెలానియా చేయిని ట్రంప్‌ అందుకోలేకపోయారు. కాసేపు  ప్రయత్నించినా చేయి అందకపోవడంతో ఇద్దరు విడివిడిగా నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఇదంతా మీడియా కంటికి చిక్కింది. ఈ వీడియోను ఎన్‌బీసీ న్యూస్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఇంకేముంది దీన్ని చూసిన నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.