అమెరికాలో రెండు రైళ్లు ఢీ

అమెరికాలో రెండు రైళ్లు ఢీ

05-02-2018

అమెరికాలో రెండు రైళ్లు ఢీ

అమెరికాలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ప్రయాణికుల రైలు న్యూయార్క్‌  నుంచి మియామికి వెళుతుండగా దక్షిణ కరోలీన వద్ద ఒక సరుకు రవాణా రైలును ఢీకొంది. ఈ ఘటన అమెరికా కాలమానం ప్రకారం తెల్లవారు జామున 2.35 సమయంలో (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.05) జరిగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికుల రైలు ఇంజిన్‌ ఎదురుగా వస్తున్న గూడ్స్‌ రైలును ఢీకొని వెనుక బోగీలపై పడింది. ప్రమాదం జరిగిన సమయంలో రైల్లో 8 మంది సిబ్బంది, 139 మంది ప్రయాణికులున్నారు. దక్షిణ కరోలినాలోని కొలంబియా పట్టణ శివార్లలో ఈ ఘటన చోటు చేసుకుంది.