ట్రంప్ కు మద్దతుగా భారతీయుల ప్రదర్శన

ట్రంప్ కు మద్దతుగా భారతీయుల ప్రదర్శన

05-02-2018

ట్రంప్ కు మద్దతుగా భారతీయుల ప్రదర్శన

గ్రీన్‌ కార్డుల జారీకి లాటరీ వీసా పద్ధతిని తొలగించి ప్రతిభ ఆధారిత వీసా పద్ధతిని ప్రవేశ పెట్టాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనకు మద్దతుగా వేలాది మంది భారతీయులు శ్వేతసౌధం ఎదుట ప్రదర్శన నిర్వహించారు. ఉద్యోగం కోసం అమెరికాలోని కాలిఫోర్నియా, టెక్సాస్‌, చికాగో, ఫ్లోరిడా వంటి రాష్ట్రాల్లో గత కొన్ని సంవత్సరాల్లో స్థిరపడిన భారతీయ నైపుణ్య ఉద్యోగులు వాషింగ్టన్‌ వచ్చి శ్వేతసౌధం ఎదుట ప్రదర్శనలో పాల్గొన్నారు. గ్రీన్‌ కార్డుల బ్యాక్‌లాగ్‌ విధానాన్ని, దేశాల కోటాను రద్దు చేయాలని, ప్రతిభ ఆధారిత పాయింట్ల విధానాన్ని కఠినంగా అమలు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు.