ఆ మెమోతోనే నిర్దోషినని తేలిపోయింది : ట్రంప్

ఆ మెమోతోనే నిర్దోషినని తేలిపోయింది : ట్రంప్

05-02-2018

ఆ మెమోతోనే నిర్దోషినని తేలిపోయింది : ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం వ్యవహారానికి సంబంధించి, రిపబ్లికన్లు తాజాగా విడుదల చేసిన మెమో తాను నిర్దోషినని రుజువుచేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఈ వ్యవహారంపై ఎఫ్‌బీఐ విచారణ చేపట్టడం, అమెరికాకే అవమానం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల విడుదలైన ఈ మెమో విచారణలో ఎఫ్‌బీఐ తమ నిఘా వ్వవస్థను దుర్వినియోగం చేసినట్లు ఆరోపించింది. ట్రంప్‌ ప్రచార సిబ్బందిలో ఒకరిపై నిఘా పెట్టేందుకు కోర్టును తప్పుదోవ పట్టించినట్లు పేర్కొంది. పూర్తి పక్షపాతంలోనే ఈ విచారణ మొదలైనట్లు నిందించింది. నేను పూర్తిగా నిర్దోషినని ఈ మెమోతో తేలిపోయింది. అయితే దుష్ప్రచారం కొనసాగుతోంది. అసలు కుట్రే లేదు. ఏడాదిపాటు అన్వేషించి, వారు ఏదీ కనుక్కోలేకపోయారు. అమెరికాకే ఇది అవమానం అని ట్రంప్‌ అన్నారు.