విద్యుత్తు ప్రేరణతో జ్ఞాపకశక్తి మెరుగుదల!

విద్యుత్తు ప్రేరణతో జ్ఞాపకశక్తి మెరుగుదల!

05-02-2018

విద్యుత్తు ప్రేరణతో జ్ఞాపకశక్తి మెరుగుదల!

తక్కువ శక్తితో కూడిన విద్యుత్తుతో మెదడును ఉత్తేజింపజేస్తే వ్యక్తుల్లో జ్ఞాపశక్తి మెరుగయ్యే అవకాశముందని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. ముఖ్యంగా పదాలకు సంబంధించిన మేధో సామర్థ్యం ఈ విధానంలో పెరుగుతుందని వెల్లడించారు. మూర్చవ్యాధికి చికిత్స తీసుకుంటున్న రోగులపై అధ్యయనం జరపడం ద్వారా అమెరికాలోని మయో క్లికిన్‌ పరిశోధకులు ఈ విషయాన్ని నిర్థారించారు. తొలుత వారు రోగులందరికీ కంప్యూటర్‌ తెరపై కొన్ని పదాలను చూపించారు. అనంతరం మెదడులోని వేర్వేరు ప్రాంతాలను తక్కువ శక్తితో కూడిన విద్యుత్తు ప్రవాహంతో ప్రేరేపించారు. లాటరల్‌ టెంపోరల్‌ కార్టెక్స్‌ ప్రాంతంలో విద్యుత్తు ఉద్దీపనం పొందిన రోగుల్లో జ్ఞాపకశక్తి మెరుగైనట్లు గుర్తించారు.  ఇతరుల కంటే ఎక్కువ పదాలు వారికి గుర్తొచ్చినట్లు తేల్చారు. మెదడులోని ఇతర ప్రాంతాలను విద్యుత్తుతో ఉత్తేజితం చేయడం ద్వారా మేధో సామర్థ్యంలో పెద్ద తేడా కనిపించలేదని సృష్టం చేశారు.