అమెరికాలో మనపై పెరిగిన దాడులు

అమెరికాలో మనపై పెరిగిన దాడులు

03-02-2018

అమెరికాలో మనపై పెరిగిన దాడులు

అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో అమెరికాలో వర్ణ వివక్ష జడలు విప్పిందని ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది. భారతీయులు సహా దక్షిణ ఆసియా, అరబ్‌ దేశస్థులు శ్వేత జాతీయుల చేతుల్లో నిత్యం అవమానాలు, దాడులకు గురి అవుతున్నారని సాల్ట్‌ (సౌత్‌ ఆసియాన్‌-అమెరికన్స్‌ లీవింగ్‌ టుగెదర్‌) అనే సంస్థ తెలిపింది. భారతీయుల్లో ఎక్కువగా అమెరికాలో ఉంటున్న ముస్లింలు విద్వేష దాడులకు ఎర అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఆ తరువాత అధికంగా సిక్కులు, హిందువులపై దాడులు జరుగుతున్నాయని సాల్ట్‌ ప్రతినిధి సుమన్‌ రఘునాథన్‌ తెలిపారు. ట్రంప్‌ హయాంలో మొత్తం 302 విద్వేష దాడులకు సంబంధించిన ఘటనలు నమోదయ్యాయన్నారు.