భారత్ దే కీలక పాత్ర : అమెరికా

భారత్ దే కీలక పాత్ర : అమెరికా

03-02-2018

భారత్ దే కీలక పాత్ర : అమెరికా

దక్షిణాసియా దేశాల విషయంలో తమ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహంలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోందని అమెరికా రక్షణశాఖ పెంటగాన్‌ వెల్లడించింది. తమ యుద్ధ విమానాలకు ఏవియేషన్‌ మెయింటెనెన్స్‌, డెవలెప్‌మెంట్‌ సాయం చేయటం ద్వారా భారత్‌ తమకు సహకరిస్తోందని పెంటగాన్‌ ప్రధాన ప్రతినిధి డన్నా వైట్‌ మీడియాకు తెలిపారు. అమెరికా- భారత్‌ సంబంధాలు బహుముఖమైనవని, భారత్‌ అభివృద్ధికి తాము అపారమైన సాయం అందిస్తున్నామని, వారు కూడా తమకు విమానాల మెయింటెనెన్స్‌ సౌకర్యం కల్పించి సహకరిస్తున్నారని ఆమె వివరించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌ పాత్ర గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ ఇందుకు అవకాశం వుందని, తాము సంబంధాలు మెరుగుపర్చుకుని, భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్న ప్రధాన దేశాలకు భారత్‌ చక్కని ఉదాహరణ అని, తాము ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించామని ఆమె వివరించారు. దక్షిణాసియా వ్యూహం విజయవంతం కావటంతో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.