పాక్ కు మరోసారి సృష్టం చేసిన అమెరికా

పాక్ కు మరోసారి సృష్టం చేసిన అమెరికా

03-02-2018

పాక్ కు మరోసారి సృష్టం చేసిన అమెరికా

తీవ్రవాదులపై పాక్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తాము కోరుకుంటున్నట్లు అమెరికా సృష్టం చేసింది. ఇటీవలే ఆప్ఘనిస్తాన్‌లో పర్యటించి వచ్చిన డిప్యూటీ విదేశాంగ మంత్రి జాన్‌ సుల్లివన్‌ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి నెలకొనేందుకు పాకిస్తాన్‌ తన వంతు కృషి చేయాలని కూడా భావిస్తున్నట్లు తెలిపారు. ఆప్ఘన్‌ నాయకత్వంలో జరిపిన చర్చల్లో ఈ విషయాలు ప్రస్తావనకు వచ్చాయని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఆప్ఘనిస్తాన్‌లో హింసాకాండ పెచ్చరిల్లకుండా వుండాలంటే పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్న తీవ్రవాదులపై చర్యలు తీసుకోవడం తప్పనిసరని అన్నారు. ఆప్ఘనిస్తాన్‌తో తమ భాగస్వామ్యాన్ని పటిష్టపరుచుకునేందుకు అమెరికాకు గల నిబద్ధతను పునరుద్ఘాటించడానికి ఈ పర్యటన తమకు మంచి అవకాశాన్ని కల్పించిందని అన్నారు.

ఈ పర్యటన సందర్భంగా ఆప్ఘన్‌ ముఖ్య నాయకులందరితో ఆయన సమావేశాలు జరిపారు. తాలిబన్‌ను చర్చల వేదిక వద్దకు తీసుకురావడానికి ప్రభుత్వ పరంగా తాము చేస్తున్న కృషిని నాయకత్వం తమకు తెలియజేసిందని సుల్లివన్‌ చెప్పారు. శాంతి, సామరస్యతలను నెలకొల్పే దిశగా సాగే ఈ క్రమం ఆప్ఘన్‌ నేతృత్వంలో సాగడం ముదావహమని వ్యాఖ్యానించారు.