ఎఫ్ బీఐకి ట్రంప్ తాఖీదులు!

ఎఫ్ బీఐకి ట్రంప్ తాఖీదులు!

03-02-2018

ఎఫ్ బీఐకి ట్రంప్ తాఖీదులు!

అమెరికా అధ్యక్షుడు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశ దర్యాప్తుసంస్థ ఎఫ్‌బీఐకి తాఖీదులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. గత అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యాన్ని నిరూపించేందుకు ఎఫ్‌బీఐ తన యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిందని, అమెరికా గూఢచార సంస్థతో ఘర్షణ పెంచుకున్నదనే కారణంతో మెమో జారీ చేయాలని ట్రంప్‌ నిర్ణయించినట్టు సమాచారం. ఈ నిర్ణయాన్ని త్వరలో కాంగ్రెస్‌ ముందు ఉంచుతారని,  ఒకవేళ మెమో జారీ అయితే ఎఫ్‌బీఐ అధిపతి రాజీనామా చేయాల్సి రావొచ్చని ప్రచారం జరుగుతున్నది.