ట్రంప్ ప్రభుత్వం నుండి మరో అధికారి ఔట్

ట్రంప్ ప్రభుత్వం నుండి మరో అధికారి ఔట్

03-02-2018

ట్రంప్ ప్రభుత్వం నుండి  మరో అధికారి ఔట్

అమెరికా విదేశాంగ శాఖలో మూడవ ర్యాంక్‌ అధికారి టామ్‌ షానస్‌ తన పదవికి రాజీనామా చేశారు. విదేశాంగ శాఖలో రాజకీయ వ్యవహారాల విభాగంలో అండర్‌ సెక్రటరీగా చేస్తున్న షానన్‌ విదేశాంగ శాఖలో అత్యంత సీనియర్‌ అధికారి. 34 ఏళ్ళకు పైగా సాగిన ఆయన కెరీర్‌లో ఆరుగురు అధ్యక్షులను, 10 మంది విదేశాంగ మంత్రులను చూశారు. తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన రాజీనామా లేఖలో తెలిపారు. ఈ నిర్ణయం నా వ్యక్తిగతం. నా కుటుంబానికి పూర్తిగా సమయాన్ని కేటాయించాలని భావించాను. నా జీవితాన్ని పూర్తిగా సమీక్షించుకుని, మిగిలిన జీవితానికి కొత్త దిశా నిర్దేశాన్ని చేసుకోవాలని భావిస్తున్నాను అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. రిటైరవాలన్న తన నిర్ణయాన్ని విదేశాంగ మంత్రి  రెక్స్‌ టిల్లర్‌సన్‌కి తెలియచేసిన షానన్‌ ఇటీవల తన విధి నిర్వహణలో భాగంగా కొన్ని సంక్లిష్టమైన, కీలకమైన అంశాలపై కృషి చేశారు. ట్రంప్‌ అధ్యక్షుడు అయిన దగ్గర నుండి సీనియర్‌ దౌత్యవేత్తలు వరుసగా రాజీనామాలు చేస్తూ వస్తున్న క్రమంలోనే షానన్‌ కూడా రాజీనామా చేయడం గమనార్హం.